Samantha: పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు

Samantha and Shaakuntalam team worships at Peddamma talli temple

  • శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి వచ్చిన హీరోయిన్
  • వచ్చే నెల 14న తెలుగు సహా ఐదు భాషల్లో శాకుంతలం విడుదల
  • ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్

హీరోయిన్ సమంత బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చే నెల 14న శాకుంతలం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించారు.

ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించిందని సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.

  • Loading...

More Telugu News