Salman Khan: బతుకమ్మ పాటలో సందడి చేసిన పూజ హెగ్డే!

Kisi Ka Bhai Kisi Ki Jaan Song released

  • సల్మాన్ హీరోగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'
  • కీలకమైన పాత్రల్లో వెంకటేశ్ .. జగపతిబాబు
  • అతిథి పాత్రల్లో మెరవనున్న చరణ్ 
  • ఏప్రిల్ 21వ తేదీన సినిమా విడుదల 


సల్మాన్ ఖాన్ హీరోగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా రూపొందింది. ఇది 2014లో అజిత్ చేసిన 'వీరమ్' సినిమాకి రీమేక్. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. అత్యధిక వసూళ్లను సాధించిన అజిత్ సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది.

మాస్ యాక్షన్ తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. అలాంటి ఈ సినిమానే సల్మాన్ హీరోగా హిందీలో రీమేక్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సల్మాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. 'బతుకమ్మ' నేపథ్యంలో ఈ పాట సాగడం విశేషం. సల్మాన్ .. వెంకటేశ్ .. పూజ హెగ్డే .. భూమికపై ఈ పాటను చిత్రీకరించారు. కలర్ఫుల్ గా సాగిన ఈ పాటకి కొరియోగ్రఫీ బాగుంది. జగపతిబాబు .. భాగ్యశ్రీ .. మాళవిక నాయర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ఒక పాటలో చరణ్ మెరవనుండటం విశేషం 

  • Loading...

More Telugu News