Jr NTR: హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్పా.. అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్ ట్వీట్

Allu arjun jr ntr tweet goes viral on social media

  • అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తారక్
  • హగ్స్ మాత్రేమేనా.. పార్టీ లేదా పుష్పా అంటూ ఫన్నీ ప్రశ్న
  • తారక్ ప్రశ్నకు దీటుగా బన్నీ రిప్లై
  • ఎస్టీఆర్ 30 డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘వస్తున్నా’ అని రిప్లై 
  • బన్నీ-తారక్ సంభాషణ నెట్టింట వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ మధ్య జరిగిన ఓ ఫన్నీ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పార్టీ లేదా బావా అని ఎన్టీఆర్ ప్రశ్నించడంతో ప్రస్తుతం బావా అన్న పదం ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఎన్టీఆర్ పార్టీ ఎందుకు అడిగారో.. అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పారో తెలుసుకుందాం పదండి..

అల్లు అర్జున్ శనివారం తన 41వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని తారక్ ట్వీట్ చేశారు. దీనికి రిప్లైగా బన్నీ..‘‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్’’ అని చెప్పారు. వెంటనే రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్..కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా? అంటూ పుష్పా డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ ట్వీట్ చేశారు. దీంతో.. బన్నీ కూడా ‘‘వస్తున్నా’’ ఎన్టీఆర్ 30లోని డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా సమాధానమిచ్చారు. ఇద్దరు స్టార్లు ఒకరి సినిమాల్లో పాపులర్ డైలాగ్స్‌ను మరొకరు ప్రస్తావిస్తూ సాగించిన సంభాషణ నెటిజన్లకు బాగా నచ్చింది. ఈ క్రమంలోనే ‘బావ’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

  • Loading...

More Telugu News