Pavan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి అడుగుపెట్టిన అందాల సుందరి!
- వరుస సినిమాలతో శ్రీలీల ఇప్పుడు ఫుల్ బిజీ
- ఈ ఏడాదిలో ఇక్కడ ఆమె చేసే సందడే ఎక్కువ
- పవన్ సరసన అలరించనున్న బ్యూటీ
- లైన్లోనే ఉన్న రామ్ .. నితిన్ సినిమాలు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో ఇప్పుడు శ్రీలీల ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో రానున్న చాలా ప్రాజెక్టులలో ఆమె సందడి చేయనుంది. ఒక వైపున బాలయ్య 108వ సినిమాలో .. మరో వైపున రామ్ .. నితిన్ సినిమాతో ఆమె బిజీగా ఉంది. తాజాగా ఈ రోజున ఆమె పవన్ సినిమా షూటింగులో పాల్గొనడానికి రంగంలోకి దిగిపోయింది.
పవన్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా హైదరాబాద్ - అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుపుకుంటోంది. ఇక్కడ శ్రీలీల కాంబినేషన్లోని సీన్స్ కూడా ఉండటంతో ఆమె ఈ రోజున సెట్స్ పైకి వచ్చేసింది.
ముందుగా ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డేను అనుకున్నారు. రెండో కథానాయికగా శ్రీలీలను సెట్ చేసుకున్నారు. కానీ పూజ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో, శ్రీలీలను ఆ ప్లేస్ లోకి తీసుకుని వచ్చేశారు. రెండో కథానాయిక విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.