Chikoti Praveen: చికోటి ప్రవీణ్ కు థాయ్ లాండ్ లో బెయిల్ మంజూరు
- పట్టాయాలోని ఓ లగ్జరీ హోటల్ లో గ్యాంబ్లింగ్
- చికోటి ప్రవీణ్ సహా 83 మంది అరెస్ట్
- ఓ లగ్జరీ హోటల్ లో రూ.100 కోట్ల గ్యాంబ్లింగ్!
- అందరికీ బెయిల్ ఇచ్చిన థాయ్ లాండ్ కోర్టు
- రూ.4,500 జరిమానా
- జరిమానా చెల్లించడంతో పాస్ పోర్టులు తిరిగిచ్చేసిన కోర్టు
కాసినో కింగ్ గా పేరుగాంచిన చికోటి ప్రవీణ్ థాయ్ లాండ్ లోని పట్టాయాలో ఓ హోటల్ లో గ్యాంబ్లింగ్ జరుపుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు భావిస్తున్న ఈ కేసులో చికోటి ప్రవీణ్ సహా 83 మంది పట్టుబడ్డారు. వారిలో చాలామంది తెలుగువారే. కాగా, ఈ వ్యవహారంలో చికోటి ప్రవీణ్ కు బెయిల్ లభించింది. అరెస్టయిన 83 మందికి థాయ్ లాండ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.4,500 జరిమానా విధించినట్టు తెలుస్తోంది. జరిమానా చెల్లించడంతో వారి పాస్ పోర్టులను న్యాయస్థానం తిరిగిచ్చేసింది.