Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఎలా చూసుకోవచ్చంటే...!

Tenth class exams results will be out today

  • ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాల వెల్లడి
  • రిజల్ట్స్ విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి బొత్స
  • ఈ ఏడాది 6.05 లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరు

ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://bse.ap.gov.in (results.bse.ap.gov.in) వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. 

ఇదే కాకుండా, పలు మీడియా సంస్థలు కూడా తమ వెబ్ సైట్లలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు ఏర్పాట్లు చేశాయి. ఏపీలో ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

  • Loading...

More Telugu News