Posani Krishna Murali: గుడివాడలో దారుణం.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు యువతి నగ్నంగా వీడియో కాల్.. వరుడికి పంపిన ప్రబుద్ధుడు!

Gudivada Girl Made Nude Video Call Video Viral On Social Media
  • ప్రియుడి కోరిక మేరకు వీడియో కాల్ చేేసిన యువతి
  • మరొకరితో యువతికి పెళ్లి నిశ్చయం
  • పెళ్లి చేసుకుంటున్నామన్న ధీమాతో అతడితో శారీరకంగా దగ్గరైన యువతి
  • తనకందిన నగ్న వీడియో చూసి పెళ్లికి నిరాకరణ
  • వైరల్ అయిన వీడియో.. అందరినీ లోపలేసిన పోలీసులు
కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఓ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన యువతి నగ్న వీడియోను చిత్రీకరించి ఆమె పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన యువతికి కర్నా న్యూటన్‌బాబు అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ స్నేహం కాస్తా ముదిరి వారి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో అతడి కోరిక మేరకు యువతి నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడింది. యువకుడు ఆ వీడియోను సేవ్ చేసుకున్నాడు. 

మరొకరితో పెళ్లి నిశ్చయం.. పెళ్లి కొడుక్కి చేరిన నగ్న వీడియో
న్యూటన్‌బాబుతో చనువుగా ఉంటున్న యువతికి మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామని భావించిన ఆమె అతడితో శారీరకంగా దగ్గరైంది. ఈ నెల 14న వీరికి వివాహం జరగాల్సి ఉండగా విషయం తెలిసిన న్యూటన్‌బాబు యువతి తనతో నగ్నంగా మాట్లాడిన వీడియోను పరంజ్యోతికి పంపాడు. అతడు ఆ వీడియోను తనకు సంబంధం కుదిర్చిన పెద్దలకు పంపి పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి ఆ వీడియోను యువతి కుటుంబానికి పంపి విషయం చెప్పి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు చెప్పాడు.

వైరల్ అయిన వీడియో.. అందరినీ లోపలేసిన పోలీసులు
న్యూటన్‌బాబు బంధువులైన బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ ఆ వీడియోను మరికొందరికి పంపారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో న్యూటన్‌బాబు సహా అందరిపైనా కేసులు నమోదు చేశారు. న్యూటన్‌బాబుపై అత్యాచార యత్నం, పెళ్లికి నిరాకరించిన పరంజ్యోతిపై అత్యాచారం కేసు, పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్‌లపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిన్న వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.
Posani Krishna Murali
Gudivada
Facebook Friend
** Video Call

More Telugu News