Ramcharan: రామ్ చరణ్, ఉపాసనల కూతురి బారసాల నేడే.. ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ఇదిగో!
- ఈ నెల 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
- చిన్నారికి ఈరోజు పేరు పెట్టే అవకాశం
- బారసాల కార్యక్రమానికి హాజరుకానున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు
రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తలిసిందే. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. మరోవైపు చిన్నారి బారసాలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. మెగా ప్రిన్సెస్ బారసాలకు చెందిన ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరుకానున్నారు.
మరోవైపు చిన్నారికి పెట్టబోయే పేరును ఇప్పటికే ఫిక్స్ చేశారు. చిరంజీవి కుటుంబం ఆంజనేయస్వామిని అత్యంత భక్తితో కొలుస్తుంది. ఈ నేపథ్యంలో, చిన్నారికి ఆంజనేయుడి పేరు కలిసేలా పేరు పెట్టొచ్చని తెలుస్తోంది. మెగా ప్రిన్సెస్ కు ఈరోజు పేరు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. చిన్నారి బాలసాల ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను వీక్షించండి.