Actor Tarun: పెళ్లి వార్తలపై స్పందించిన సినీ నటుడు తరుణ్
- తరుణ్ కు పెళ్లి అయిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
- ఈ వదంతులు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్న తరుణ్
- తనకు ఇంకా పెళ్లి కాలేదని వెల్లడి
సినీ నటుడు తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్తలపై తరుణ్ స్పందించాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు. తనకు పెళ్లి జరిగిందనే వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఇలాంటి వదంతులు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నాడు. పెళ్లి ఫిక్స్ అయితే తానే ఆ శుభవార్తను అందరితో పంచుకుంటానని చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే బాలనటుడిగా తరుణ్ ఎన్నో సినిమాలలో నటించాడు. 2000లో విడుదలైన 'నువ్వే కావాలి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2018లో విడుదలైన 'ఇది నా లవ్ స్టోరీ' సినిమా ఆయనకు చివరిది. ఈ తర్వాత ఆయన సినిమాలలో నటించలేదు.