Pavan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఇదే!
- 'ఉస్తాద్ భగత్ సింగ్' గా పవన్ కల్యాణ్
- హరీశ్ శంకర్ తో ఇది రెండో సినిమా
- సెప్టెంబర్ 5 నుంచి నెక్స్ట్ షెడ్యూల్
- సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్
పవన్ కల్యాణ్ తో గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్, అప్పటి నుంచి ఆయనతో మరో సినిమా చేయాలని చూస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఈ మధ్యనే పట్టాలెక్కింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరువుకుంది. 'బ్రో' సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో, పవన్ ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇవ్వడం వలన కొంత గ్యాప్ వచ్చింది. తదుపరి షెడ్యూల్ ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మొదలుపెడుతున్నారు. పవన్ సరసన నాయికగా శ్రీలీల కనిపించనుంది.
ఈ ఇద్దరితో పాటు ముఖ్య పాత్రధారులు ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నారని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తున్న ఈ సినిమాలో, పొలిటికల్ సెటైర్లు ఎక్కువగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రల్లో అశుతోష్ రాణా .. నవాబ్ షా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.