Rashi Khanna: చీరకట్టులో మెరిసిన అందాల రాశి .. లేటెస్ట్ పిక్స్!
- ఆరంభంలో నిదానాన్ని పాటించిన రాశి ఖన్నా
- ఆ తరువాత గ్లామర్ డోర్ పెంచుతూ వెళ్లిన భామ
- ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోను బిజీ
- సోషల్ మీడియాలోనూ అందాల సందడి
రాశి ఖన్నా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరియర్ ఆరంభంలోనే చెప్పుకోదగిన సక్సెస్ లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆరంభంలో అంతా కూడా ఆమెను గ్లామర్ డాల్ గానే భావించారు. కానీ ఆ తరువాత ఆమె అభినయం నేర్చుకుని, స్టార్ హీరోయిన్స్ ధాటిని తట్టుకుని నిలబడింది.సాధారణంగా కామెడీ చేయడంలో హీరోయిన్స్ కాస్త వీక్ గా ఉంటారు. కానీ రాశి ఖన్నా అవలీలగా కామెడీ చేసే స్థాయికి వెళ్లింది. అందుకు ఉదాహరణగా 'సుప్రీమ్' .. 'ప్రతి రోజూ పండగే' సినిమాలు నిలబడతాయి. అయితే ఒక దశ తరువాత రాశి ఖన్నా కాస్త లావు తగ్గి నాజూకుగా మారింది .. గ్లామర్ డోస్ పెంచింది. అంతే కాదు ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది. రాశి ఖన్నా కాస్త దూకుడు పెంచుదామని అనుకుంటూ ఉండగానే, తెలుగులో ఆమెకి 'పక్కా కమర్షియల్' .. 'థ్యాంక్యూ' వంటి ఫ్లాపులు పడ్డాయి. అయినా బెంగపెట్టుకోకుండా ఆమె ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లు చేస్తూ ముందుకు వెళుతోంది. సోషల్ మీడియాలోను కాస్త యాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా వదిలిన ఈ ఫొటోల్లో ఆమె పచ్చల హారం ధరించిన కెంపులా మెరిసిపోతోంది. రాశి పోసిన ఈ అందాల నుంచి కళ్లు తిప్పుకోవాలంటే కుర్రాళ్లకి కష్టమే మరి.