Ravula Chandra Sekhar Reddy: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత
- టీడీపీకి గుడ్ బై చెప్పిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
- టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రావుల
- టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కూడా బాధ్యతలు
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రావులను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.