Comedian: వ్యభిచారంపై వ్యాఖ్యలతో వివాదంలో పడిన కమెడియన్
- కూల్ ప్రొఫెషన్ గా పేర్కొన్న విదూషి స్వరూప్
- ఆమె వ్యాఖ్యల పట్ల విమర్శల జడివాన
- మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ సూచన
స్టాండప్ కమెడియన్ (లైవ్ షోలు నిర్వహించే) విదూషి స్వరూప్ తన వ్యాఖ్యలతో వివాదం కొనితెచ్చుకున్నారు. వ్యభిచారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వ్యభిచారాన్ని ‘కూల్ ప్రొఫెషన్’ (ప్రశాంతమైన వృత్తి) గా పేర్కొన్నారు. ఇతర వృత్తుల కంటే ఇది ఎంత భిన్నమో ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వెంటనే వేడిని రగిల్చాయి. ఇంటర్నెట్ లో ఆమెపై విమర్శల జడివాన కురవడం మొదలైంది.