Manohar lal Khattar: మారువేషంలో మేళాకు వెళ్లిన హర్యానా ముఖ్యమంత్రి!
- పంచకులలోని సెక్టర్-5లో ఏర్పాటు చేసిన మేళాలో సీఎం
- ముఖం కనబడకుండా తువ్వాలు కప్పుకుని, జేబులో చేతులు పెట్టుకుని తిరుగాడిన వైనం
- నెట్టింట వీడియో వైరల్
ముఖం కనబడకుండా ముఖానికి వస్త్రం అడ్డుపెట్టుకుని, మారు వేషంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓ మేళాలో సంచరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పంచకుల నగరంలోని సెక్టర్-5లో ఓ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మేళాలో మంగళవారం ముఖ్యమంత్రి తిరుగాడారు. టోపీ, మాస్క్, ముఖానికి తువ్వాలు ధరించిన సీఎంను చుట్టుపక్కల వారెవ్వరూ గుర్తించలేకపోయారు. ఆయన వెంట ఉండే సెక్యూరిటీ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ ప్రదేశంలో ఫోన్ మాట్లాడిన సీఎం ఆ తరువాత సమీపంలో తినుబండారాలు కొనుగోలు చేశారు. ఓ సాధారణ వ్యక్తిలా జేబులో చేతులు పెట్టుకుని ముఖ్యమంత్రి ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. దీనికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు.