Bogg Boss: 'బిగ్ బాస్' ప్రియాంక పేరెంట్స్ చిన్న ఫ్లాట్ లో రెంట్ కి ఉంటున్నారు: శివకుమార్
- బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న ప్రియాంక
- ఆమె ఆర్ధిక పరిస్థితి గురించి ప్రస్తావించిన శివ
- ఇంటి రెంట్ కూడా ఆమెనే కడుతుందని వెల్లడి
- పెళ్లి గురించిన ఆలోచన ఇప్పుడే లేదని వ్యాఖ్య
బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక .. మిగతా సభ్యులకు గట్టిపోటీ ఇస్తోంది. టాప్ 5లో ఆమె ఉండొచ్చనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఆమె కోసం ఓ ఫ్రెండ్ గా హౌస్ కి వచ్చిన దగ్గర నుంచే శివకుమార్ బయటికి ఎక్కువగా తెలిశాడు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రియాంక గురించి ప్రస్తావించాడు.
"ప్రియాంక వాళ్ల ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. గతంలో ఆమె ఫాదర్ బిజినెస్ చేసి నష్టపోవడం వలన, వాళ్ల ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్లి ఎక్కడా ఏ పనీ చేసే పరిస్థితి లేదు. ప్రియాంక వాళ్ల మదర్ .. పెళ్లిళ్లకు వెళ్లి మెహందీ పెడుతూ ఉంటుంది. చాలా తక్కువ ఎమౌంట్ కి ఆమె ఆ పని చేస్తోంది" అని అన్నాడు.
"ప్రియాంక వాళ్ల పేరెంట్స్ బెంగళూర్ లో ఒక చిన్న ఫ్లాట్ లో రెంట్ కి ఉంటున్నారు. ఆ రెంట్ కూడా ప్రియాంకనే ప్రతి నెలా పంపిస్తూ ఉంటుంది. ప్రియాంక చేసే సీరియల్స్ .. ప్రోగ్రామ్స్ వల్లనే వాళ్ల ఫ్యామిలీ నిలదొక్కుకుంది. జీవితంలో ఇంకా ఎదగాలి .. సంపాదించాలి .. అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనే నేను .. ప్రియాంక ఆలోచన చేశాము" అని చెప్పాడు.