Budda Venkanna: చంద్రబాబు ముందు నువ్వొక కోన్ కిస్కా గొట్టం: కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్
- కేశినేని వంటి ఎంపీలను చంద్రబాబు వందల మందిని తయారు చేశారన్న వెంకన్న
- చంద్రబాబు మంచితనాన్ని కేశినేని నాని, కొడాలి నాని, వంశీ అలుసుగా తీసుకున్నారని మండిపాటు
- కేశినేని నానిలో అప్పుడే భయం మొదలయిందని వ్యాఖ్య
వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. విజయవాడను చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న నాని వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. విజయవాడలోని ఫ్లైఓవర్లు, రోడ్లు అన్నీ చంద్రబాబు వేయించినవే అని చెప్పారు. నీలాంటి ఎంపీలను వందల మందిని చంద్రబాబు తయారు చేశారని అన్నారు. నువ్వు ఆఫ్ట్రాల్ ఒక బచ్చావని విమర్శించారు. చంద్రబాబు ముందు నువ్వు కోన్ కిస్కా గొట్టం అని అన్నారు. ఆఫ్ట్రాల్ ఒక ఎంపీవి నీవు విజయవాడను అభివృద్ధి చేయడం ఏమిటని దుయ్యబట్టారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ చేశారని... జగన్ సీఎం అయిన తర్వాత విజయవాడలో నీవు ఒక్క పని కూడా ఎందుకు చేయించలేకపోయావని ప్రశ్నించారు.