Balakrishna: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహాసిని నివాళులు.. ఫొటోలు ఇవిగో!

Pics of Balakrishna and Junior NTR paying tributes to NTR at NTR ghat
  • నేడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి
  • తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న అభిమానులు
టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఘాట్ వద్ద నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Balakrishna
Nara Bhuvaneswari
Junior NTR
Kalyan Ram
Suhasini
Telugudesam
Tollywood

More Telugu News