Bharateeyudu 2: జులై 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్

Bharateeyudu 2 pre release event will be held in Hyderabad on July 7

  • కమల్ హాసన్, శంకర్ కాంబోలో భారతీయుడు-2
  • జులై 12న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ముమ్మరంగా ప్రమోషన్ ఈవెంట్స్ 

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం భారతీయుడు-2. ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 

విడుదలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ తో చిత్రబృందం బిజీగా ఉంది. కాగా, భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 7న హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు-2. గతంలో కమల్, శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. 

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన 'చెంగల్వ'... 'కాలెండర్' సాంగ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News