Rakul Preet Singh: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Rakul Preet Singh brother arrested in drugs case
  • రూ. 2 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
  • గోవా కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా
  • డ్రగ్స్ వ్యవహారంలో గతంలో విచారణ ఎదుర్కొన్న రకుల్
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Rakul Preet Singh
Tollywood
Brother
Drugs
Hyderabad

More Telugu News