Devara: 'దేవ‌ర' నుంచి బిగ్ అప్‌డేట్‌... సెకండ్ సాంగ్‌కు తేదీ ఫిక్స్!

Devara Second Single on August 5th

  • ఎన్‌టీఆర్‌, కొర‌టాల కాంబోలో 'దేవ‌ర‌'
  • రెండో సాంగ్ ను ఈ నెల‌ 5న విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించిన మేక‌ర్స్‌
  • సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానున్న మూవీ

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీ 'దేవ‌ర‌'. ఈ ఇద్ద‌రి కాంబోలో ఇంత‌కు ముందు వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్' సూప‌ర్ హిట్ కావ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇప్ప‌టికే విడుద‌ల‌యిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సింగిల్, టీజ‌ర్ ల‌కు మంచి స్పంద‌న‌ ద‌క్కింది. ఈ క్ర‌మంలో ఈ సినిమా నుండి మేక‌ర్స్ తాజాగా ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీలోని రెండో సాంగ్ ను ఈ నెల‌ 5న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ పాట‌ ఓ రొమాంటిక్ సాంగ్‌గా ఉండ‌బోతుంద‌ని ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ అందాల జాన్వీ క‌పూర్ న‌డుము చుట్టూ చేయి వేసి ఆమె క‌ళ్ల‌లోకి చూస్తున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్ డిజైన్ చేశారు.

కాగా, తార‌క్ న్యూ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ లో జాన్వీ క‌పూర్‌ కూడా అంతే అందంగా ఉంది. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా న‌టిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News