Devara: 'దేవర' సెకండ్ సాంగ్ రిలీజ్.. మెలోడియస్‌ ట్యూన్‌తో మెస్మ‌రైజ్ చేసిన అనిరుధ్‌!

Devara Second Single Chuttamalle Out Now

  • తార‌క్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘దేవర’
  • 'చుట్టమల్లే' అంటూ సాగే రెండో సాంగ్ విడుద‌ల‌
  • ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, ఫియర్ సాంగ్‌తో మూవీపై భారీగా అంచ‌నాలు
  • సెప్టెంబర్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానున్న సినిమా

యంగ్‌టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘దేవర’ నుంచి ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, ఫియర్ సాంగ్‌తో మూవీపై భారీగా అంచ‌నాలు పెంచేశాయి. దీంతో యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ‘దేవర’ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌ రిలీజైంది. 

'చుట్టమల్లే' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శిల్పా రావు గాత్రం గ‌మ‌త్తుగా అనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. అనిరుధ్ రవిచందర్ త‌న‌ బాణీలతో మ‌రోసారి మెస్మ‌రైజ్ చేశాడ‌నే చెప్పాలి. మెలోడియస్‌ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు. 

ఇక ఈ పాట వింటుంటే ఫియర్ సాంగ్‌ను ట్యూన్ చేసింది అనిరుధేనా? అన్న డౌట్ రాక‌మాన‌దు. ఎందుకంటే అనిరుధ్ అంటే ఊపు వచ్చే ఫాస్ట్ బీట్ లు, మాస్ సాంగ్స్ గుర్తుకువస్తాయి. కానీ 'చుట్టమల్లే' సాంగ్ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. 

ఇక ఈ సాంగ్ తాలూకు లిరికల్ వీడియో కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. తార‌క్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండ‌గా.. జాన్వీ కూడా ఎప్పటిలానే అంతే అందంగా కనిపించింది. మొత్తానికి ఈ 'చుట్టమల్లే' సాంగ్‌తో మూవీపై అంచనాలు అమాంతం పెంచేశారు మేక‌ర్స్‌. కాగా, ఈ చిత్రం మొద‌టి పార్ట్‌ సెప్టెంబర్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. 

  • Loading...

More Telugu News