Maruti Nagar Subramanyam: 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'పై మహేశ్ బాబు రివ్యూ

Mahesh Babu reviews on Maruti Nagar Subramanyam

  • రావు రమేశ్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ
  • ఆగస్టు 23న రిలీజ్
  • కడుపుబ్బా నవ్వించేలా ఉందన్న మహేశ్ బాబు

రావు రమేశ్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ బలంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. 

కాగా, ఈ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుల పల్లకీలో ప్రయాణిస్తున్నట్టే ఉందని అభివర్ణించారు. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ ఫ్యామిలీ ఎంటర్టయినర్ సినిమాల్లో మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా కూడా ఒకటని కితాబిచ్చారు. ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించిన తబిత సుకుమార్ కు, యావత్ చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News