Ntr: ఎన్టీఆర్ .. జాన్వీ హుషారైన స్టెప్స్ తో 'దేవర' సాంగ్!

Devara New Song Released

ఎన్టీఆర్ - జాన్వీ జంటగా రూపొందిన 'దేవర'
సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ 
తాజాగా మరో సాంగ్ ను వదిలిన టీమ్
ఈ నెల 27వ తేదీన సినిమా రిలీజ్  


ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంటగా 'దేవర' సినిమా రూపొందింది. సుధాకర్ మిక్కిలినేని - కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, కొరటాల దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ సినిమా కోసమే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. టాలీవుడ్ వైపు నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్న పెద్ద సినిమా ఇదే. 

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం మరో సాంగ్ ను వదిలారు. ఎన్టీఆర్ - జాన్వీ మరికొందరు డాన్సర్లపై ప్రత్యేకంగా వేసిన కలర్ ఫుల్ సెట్లో  ఈ పాటను చిత్రీకరించారు.

ఎన్టీఆర్ - జాన్వీ హుషారైన స్టెప్స్ .. కాస్ట్యూమ్స్ .. ఫొటోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొరియోగ్రఫీలో కూడా కొత్తదనం కనిపిస్తోంది. ఇక అనిరుధ్ వైపు నుంచి చూస్తే, గతంలో ఆయన 'బీస్ట్' సినిమా కోసం చేసిన అరబిక్ కుతూ బీట్ కి ఈ బీట్ దగ్గరగా అనిపిస్తోంది.

  • Loading...

More Telugu News