Devara Part 1: ‘దేవర’కు సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా?
- కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘దేవర’ పార్ట్-1
- యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ
- ట్రైలర్ కూడా లాంచ్ కాకముందే అరుదైన రికార్డు
ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 27న విడుదల కానున్న ’దేవర’ పార్ట్-1 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. దర్శకుడు కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. సినిమా నిడివి 2.57 గంటల 58 సెకన్లు. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివి ఉంటున్నాయి.
జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ టాలీవుడ్లో అడుగుపెడుతుండగా, సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపించనున్నాడు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, మూవీకి అదే హైలైట్ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా దేవర రికార్డులకెక్కింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర రికార్డులకెక్కింది.