Devara: ఆ సెంటిమెంట్ బ్రేక్ కావ‌డానికి స‌రిగ్గా 23ఏళ్లు ప‌ట్టింది.. 'దేవ‌ర‌'పై రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్

SS Rajamouli Son SS Karthikeya Interesting Tweet on Devara

  • ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో దేవ‌ర
  • పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తార‌క్ సినిమా
  • 23 ఏళ్ల రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్‌టీఆర్ బ్రేక్
  • ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిక‌గా కార్తికేయ స్పెష‌ల్ పోస్ట్‌

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన దేవ‌ర మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తార‌క్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోవ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది. 

ఇక ఈ సినిమా విజ‌యంతో 23 ఏళ్ల ఓ సెంటిమెంట్‌కు తెర‌ప‌డిన‌ట్లైంది. అదేంటంటే.. ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో న‌టించిన‌ హీరోల తదుపరి చిత్రాలు ఫెయిల్ కావ‌డం అనేది ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది.  

ఇలా జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకు వెంటనే హిట్ కొట్టలేదు. ప్రతి హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచారు. ఇది స్టూడెంట్ నెం.1 మూవీ నుంచి వస్తున్న ఆనవాయతిగా మారిపోయింది. దీంతో ఎన్టీఆర్ ఇంతకుముందు సినిమా 'ఆర్ఆర్ఆర్' రాజమౌళితో చేసి వుండడం వల్ల అందరి దృష్టీ గత కొంత కాలంగా దేవరపై పడింది. ఆ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని, ఇది హిట్టవుతుందా? అన్న సందేహం అందరిలోనూ కలిగింది. కానీ, ఇప్పుడా సెంటిమెంట్‌ని 'దేవ‌ర‌'తో తార‌క్‌ బ్రేక్ చేశారు. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్‌ నటించిన 'స్టూడెంట్ నెం.1' సెప్టెంబర్ 27, 2001న విడుదలైంది. ఇప్పుడు 'దేవర' కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్‌ అయింది. ఈ సినిమా విజ‌యం సాధించింది. దాంతో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయడానికి ఎన్‌టీఆర్‌కు 23 ఏళ్లు పట్టింది. అది కూడా 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మొదలైందో, మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజున‌ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌కు తెర‌ప‌డింది.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ పోస్టు పెట్టాడు. "ఫైన‌ల్‌గా 23 సంవత్సరాల ఫ్లాప్ సెంటిమెంట్‌కు తెర‌ప‌డింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బ్రేక్ అయింది. ఆయన్ను దగ్గరి నుంచి చూస్తూ పెరిగాను. 

ఇప్పుడు ఆయన చేస్తున్న‌ అద్భుతాలను చూస్తున్నాను. ఈ స‌మ‌యంలో నాకు మాటలు రావడం లేదు. అభిమానులంద‌రికీ ఆయన ఇచ్చిన పెద్ద కానుక‌ ఇది" అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను కార్తికేయ పోస్ట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  • Loading...

More Telugu News