Prakash Raj: పవన్ పై మరోసారి ప్రకాశ్ రాజ్ సెటైర్లు
- ఉదయనిధి స్టాలిన్ ను మెచ్చుకుంటూ పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు
- సనాతన ధర్మం విషయంలో ఇటీవల ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టిన పవన్ కల్యాణ్
- చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన ప్రకాశ్ రాజ్
నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే, మరొక డిప్యూటీ సీఎం మాత్రం సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.
తమది సమానత్వమని, తాను ప్రశ్నిస్తే భయపడుతున్నారని అన్నారు. అయితే, తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరఫునే మాట్లాడతానని, ప్రశ్నిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, ప్రకాశ్ రాజ్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశ్ రాజ్ చెన్నైలో చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించినవేనని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.