Veera Dheera Sooran: విక్రమ్ కొత్త చిత్రం 'వీర ధీర శూరన్' నుంచి టీజర్ విడుదల

Vikram starring Veera Dheera Sooran teaser out now

  • విక్రమ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ 
  • ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వీర ధీర శూరన్

తమిళ కథానాయకుడు అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నటుడు విక్రమ్.... తమిళులకు 'చియాన్' విక్రమ్. విక్రమ్ కు తెలుగులోనూ ఫర్వాలేదనిపించే మార్కెట్ ఉంది. సరికొత్త పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపించే విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం 'వీర ధీర శూరన్: పార్ట్ 2'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ అని అర్థమవుతోంది. 

ఈ చిత్రానికి ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. ఇందులో విక్రమ్ కు జోడీగా దుషారా విజయన్ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ 'వీర ధీర శూరన్: పార్ట్ 2' చిత్రం 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News