Nana Hairana: రామ్ చరణ్ 'నానా హైరానా' పాటకు 47 మిలియన్ల వ్యూస్

Nana Hairana song from Game Changer garners 47 million views

  • రామ్ చరణ్, కియారా జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • జనవరి 10న రిలీజ్
  • ఇటీవల నానా హైరానా సాంగ్ విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి ఇటీవలే నానా హైరానా అనే మెలోడియస్ సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ పాట యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఇప్పటిదాకా ఈ హుషారైన పాటకు 47 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

ఈ ఫ్యూజన్ మెలోడీ గీతాన్ని రామ్ చరణ్, కియారాలపై న్యూజిలాండ్ లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో ఆరు రోజుల పాటు చిత్రీకరించారు. హైదరాబాద్ నుంచి ఆక్లాండ్ వెళ్లిన రామ్ చరణ్... అక్కడ్నించి హెలికాప్టర్ లో క్రైస్ట్ చర్చ్ నగరానికి వెళ్లారు. అక్కడి కనువిందు చేసే లొకేషన్లలో కియారాతో ఆడిపాడారు. 

ఈ పాటలో రామ్ చరణ్, కియారా జోడీ ప్రఖ్యాత డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో కనువిందు చేశారు. ఈ పాట కోసం మేకర్స్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఆలిమ్ హకీమ్ ఫ్యాషనబుల్ హెయిర్ స్టయిలింగ్ తో రామ్ చరణ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. 

అన్నింటికి మించి తమన్ అందించిన బాణీలు, మ్యూజిక్ అదరహో అనేలా ఉన్నాయి. అందుకే ఈ పాటకు వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. 

  • Loading...

More Telugu News