Sabarimala: ఈ నెల 29 వరకు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
- ముగిసిన మండల దీక్షల సీజన్
- నిన్న మండల పూజ అనంతరం ఆలయం మూసివేత
- ఈ నెల 30న తిరిగి తెరుస్తామన్న ఆలయ వర్గాలు
- జనవరి 14న మకర విళక్కు
దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. నిన్న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు.
ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతామని, తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.
జనవరి 14న మకర విళక్కు పర్వదినం సందర్భంగా లక్షలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తారు.
కాగా, ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.