Anchor Ravi: యాంకర్ రవికి రాష్ట్రీయ వానరసేన వార్నింగ్.. కాల్ ఆడియో లీక్!

Anchor Ravi Receives Warning from Rashtriya Vanar Sena
  • వివాదాస్పదమైన స్కిట్
  • యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ పై తీవ్ర విమర్శలు
  • రవికి కాల్ చేసిన రాష్ట్రీయ వానరసేన నేత కేశవరెడ్డి 
  • హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ 
  • నువ్వు  కూడా హిందువువే కదా అని అడిగిన కేశవరెడ్డి
  • నేను ఇండియన్ ను అని బదులిచ్చిన రవి
ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం, ఇప్పుడది వివాద్పాదం కావడం తెలిసిందే. నందీశ్వరుడి కొమ్ముల్లోంచి చూస్తే, దేవుడికి బదులు అమ్మాయి కనిపించడం అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా యాంకర్ రవికి రాష్ట్రీయ వానరసేన నుంచి గట్టి వార్నింగ్ వెలువడింది. దీనికి సంబంధించిన కాల్ ఆడియో లీక్ అయింది. 

రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంఘానికి చెందిన కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి కాల్ చేసి... మీరు, ఆ సుడిగాలి సుధీర్ కలిసి ఆ వివాదాస్పద స్కిట్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. హిందువులను కించపరుస్తారా? అని నిలదీశారు. 

అందుకు యాంకర్ రవి బదులిస్తూ... మెగాస్టార్ చిరంజీవి బావగారూ బాగున్నారా సినిమాలో చేశారు కాబట్టే తాము ఆ సీన్ ను రీ క్రియేట్ చేశామని బదులిచ్చారు. వాళ్లు తప్పు చేశారని, మీరు కూడా తప్పు చేస్తారా? అని కేశవరెడ్డి అన్నారు. అది తప్పు అని ఎవరూ చెప్పలేదండీ... చిరంజీవి గారే చేశారు కదా అని మేం కూడా చేశాం అంటూ రవి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

మీరు చేసింది 100 శాతం తప్పండీ... హిందువులకు మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని కేశవరెడ్డి స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పాలంటే మీకు ఇగో అడ్డొస్తుందా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి గారూ మీరు హిందువు కాదా అని కేశవరెడ్డి ప్రశ్నించగా... నేను ఇండియన్ అని రవి బదులిచ్చారు. అందుకు కేశవరెడ్డి స్పందిస్తూ... ఇండియన్ అని చెప్పి ఇలా హిందువులను కించపరిచే వీడియోలు చేస్తుంటారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు.
Anchor Ravi
Sudigali Sudheer
Rashtriya Vanar Sena
controversial skit
Chiranjeevi
Bava Garu Bagunnara
Hindu sentiments
call audio leak
warning
religious controversy

More Telugu News