Kingdom: విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' నుంచి అదిరిపోయే పోస్టర్

- విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో కింగ్డమ్
- విజయ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
- ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- తాజాగా ఈ సినిమా నుంచి వైల్డ్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్'. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ మూవీలో రౌడీ బాయ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంటెన్స్ టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో వైల్డ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కింగ్డమ్ మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్‌తో కొత్త పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ చిత్రంపై రౌడీబాయ్ ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.