Samantha Ruth Prabhu: నటి సమంతతో భర్తకు రిలేషన్?.. రాజ్ భార్య పోస్ట్ కలకలం

Raj Nidimorus Wifes Cryptic Post Amidst Samantha Rumors
  • నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్‌పై రూమర్లు
  •  తాజాగా రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి సందేశాత్మక ఇన్‌స్టా పోస్ట్
  • 'శుభం' టీంతో సమంత ఫోటోల తర్వాత శ్యామాలి స్పందన
  • శ్యామాలి పోస్ట్ వెనుక ఆంతర్యంపై నెటిజన్ల చర్చ
  • గతంలో రాజ్-శ్యామాలి విడిపోతున్నారంటూ వార్తలు
నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు మధ్య ఏదో నడుస్తోందంటూ కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చిట్టు అయింది. ఈ నేపథ్యంలో రాజ్‌ నిడిమోరు భార్య శ్యామాలి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ సందేశాత్మక పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

"నా గురించి ఆలోచించేవారు, వినేవారు, మాట్లాడేవారు, నన్ను కలిసేవారు, నాతో మాట్లాడేవారు, నా గురించి రాసే వారందరికీ నా ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా" అంటూ శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. చాలాకాలంగా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశాత్మక పోస్ట్‌ పెట్టడం వెనుక ఆంతర్యమేమిటన్న దానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

‘శుభం’ సినిమా సక్సెస్‌లో భాగంగా ఆ చిత్ర బృందంతో పాటు దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘శుభం’తో ఓ అద్భుత ప్రయాణం మొదలైందని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటోలు వైరల్‌ అయిన కాసేపటికే శ్యామాలి నుంచి ఈ పోస్ట్‌ రావడం గమనార్హం.

శ్యామాలి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. గతంలో బాలీవుడ్‌ దర్శకులు రాకేశ్‌ ఓం ప్రకాష్ మెహ్రా, విశాల్‌ భరద్వాజ్‌ల వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ‘రంగ్‌ దే బసంతి’, ‘ఓంకార’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆమె క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గానూ సేవలందించారు. 2015లో రాజ్‌ నిడిమోరును వివాహం చేసుకున్న శ్యామాలికి ఒక పాప ఉన్నట్లు సమాచారం. వివాహం అనంతరం రాజ్‌ దర్శకత్వం వహించిన సినిమాల క్యాస్టింగ్‌ వ్యవహారాల్లో ఆమె సహాయ సహకారాలు అందించేవారని రాజ్‌ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. కొద్ది కాలం క్రితం రాజ్‌, శ్యామాలి విడిపోతున్నారంటూ కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రాజ్‌ నిడిమోరు, డీకే ద్వయం దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో పాటు, త్వరలో రానున్న ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌లోనూ సమంత కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టుల సందర్భంగానే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం శ్యామాలి చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Shyamali
Shubham Movie
The Family Man 2
Citadel: Honey Bunny
Viral Instagram Post
Celebrity Relationship Rumors
Indian Cinema
Tollywood

More Telugu News