Samantha Ruth Prabhu: సమంత, రాజ్ నిడిమోరు ప్రేమాయణం? భార్య పోస్టులతో కొత్త చర్చ!

Samantha Ruth Prabhu and Raj Nidimoru Dating Rumors Spark Controversy
  • డేటింగ్ వార్తలపై అధికారికంగా స్పందించని సమంత, రాజ్
  • సమంత, రాజ్ చేయి పట్టుకున్న ఫోటోతో రూమర్లకు మరింత బలం
  • రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే పరోక్ష సోషల్ మీడియా పోస్టులు
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమాయణంపై వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ సమంత కానీ, రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ ప్రచారం నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని పరోక్ష పోస్టులు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. "మంచి కర్మను సృష్టించండి. ప్రజలకు సహాయం చేయండి, అందరినీ న్యాయంగా చూడండి" అంటూ ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. అంతకుముందు కూడా శ్యామలి ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పంచుకున్నట్లు సమాచారం. ఈ పోస్టులన్నీ సమంత, రాజ్‌ల సంబంధాన్ని ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.

మరోవైపు, రాజ్ నిడిమోరు, శ్యామలి దేల వైవాహిక జీవితంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. వారిద్దరూ ఇంకా కలిసే ఉన్నారా, లేక 2022లోనే విడిపోయారా అనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఫిబ్రవరి 1న జరిగిన వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత, రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో వీరి డేటింగ్ వదంతులు ఊపందుకున్నాయి. సమంత చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికెల్‌బాల్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'శుభం' వేడుకల్లో కూడా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సమంత పంచుకున్నారు. గతంలో నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకున్నారు.
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Dating Rumors
Samantha Raj Nidimoru
Shyamali Dey
Instagram Posts
Marriage
Divorce
Tollywood
Pickleball

More Telugu News