Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి

- నేడు ఎన్టీఆర్ జయంతి
- హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ప్రముఖులు
- ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ప్రముఖుల రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తారు.