Chaurya Paatham: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'చౌర్యపాఠం' స్ట్రీమింగ్

- బ్యాంకు దోపిడీ కథతో తీసిన మూవీ చౌర్యపాఠం
- ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చౌర్యపాఠం
- మూడు వారాల్లోనే ఓటీటీలోకి
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చౌర్యపాఠం'. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలైన కొద్ది రోజులకే థియేటర్ల నుంచి నిష్క్రమించింది.
తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'చౌర్యపాఠం' కథాంశం విషయానికి వస్తే.. వేదాంత్ రామ్ (ఇంద్రరామ్) దర్శకుడు కావాలని కలలు కంటాడు. అయితే నిర్మాతలు ముందుకు రాకపోవడంతో బ్యాంకు దోపిడీ చేసి ఆ డబ్బుతో సినిమా నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన పథకంలో భాగస్వాములను చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి (పాయల్ రాధాకృష్ణ) వీళ్లతో కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.