NTR: మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి

- తెలుగుజాతి గుండెల్లో పెట్టుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్
- రెండు రంగాల్లో రారాజుగా రాణించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత
- సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే నాయకుడని కొనియాడిన చంద్రబాబు
తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదిక పైనుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు. సాధారణ రైతు బిడ్డగా పుట్టిన ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు.
పదవికి కొత్త భాష్యం..
అధికారం అంటే బాధ్యత అని, పదవి అంటే సేవ చేసే అవకాశమని, పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాలే మార్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి తెలుగు సినీరంగంలో ఎవరెస్టుగా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అనితర సాధ్యమని, మన కళ్లముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితమేమీ పూలపాన్పు కాదని, నిరంతరం పోరాటాలతోనే ఆయన ఎదిగారని చెప్పుకొచ్చారు. స్వీయక్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలని చంద్రబాబు తెలిపారు.
పసుపు జెండా శాశ్వతం..
43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చంద్రబాబు చెప్పారు. ఈ జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారని అన్నారు. సినీ రంగంలో 33 ఏళ్లు, రాజకీయ రంగంలో 13 ఏళ్ల పాటు ఎన్టీఆర్ అద్వితీయ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తూ ఏ సంకల్పం చేసినా దానిని సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని చంద్రబాబు వివరించారు.
ఆయన ప్రసంగమే ఓ గర్జన..
చైతన్యరథంపై రాష్ట్రంలో తిరుగుతూ ఎన్టీఆర్ గర్జించారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుంటే గర్జించినట్లే ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో ఆయన అలవోకగా సాధించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా అని, యువతకు భవిష్యత్తు అని, కార్మిక లోకానికి అండ అని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సుపరిపాలనకు ఆద్యులు ఎన్టీఆర్..
సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన తో పాలనలో కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆద్యులుగా నిలిచారని చంద్రబాబు చెప్పారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారని, అందరికీ పక్కా ఇళ్లు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్ పవర్ విద్యుత్, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం... ఇలా సంక్షేమాన్ని- అభివృద్ధిని సమతుల్యం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, సింగిల్ విండో విధానానికి రూపకల్పన చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు.
రాజకీయాల్లోకి రాకముందు కూడా..
ఎన్టీఆర్ నిరంతరం ప్రజల కోసమే ఆలోచించేవారని, రాజకీయాల్లోకి రాకముందు కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. 1952 సంవత్సరంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు,1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎన్టీఆర్ జోలె పట్టి విరాళాలు సేకరించారని చెప్పారు. 1965లో భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు, 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు, 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు... వేల మంది మృత్యువాత పడి, లక్షలాది మంది నిరాశ్రయులైతే ఎన్టీఆర్ స్వయంగా దివిసీమ వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేద్దాం...స్వర్ణాంధ్ర సాధిద్దాం..
ఈ నాలుగు దశబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు దాటొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఎన్నో విజయాలు, మరెన్నో అనుభవాలు మూటగట్టుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్తున్నామని, ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ తపించారని, ఆయన ఆశయ సాధన కోసం పీ4 విధానాన్ని తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆర్ధిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వివరించారు. పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.