Ram Charan: రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. నెట్టింట వార్త హల్‌చల్

- ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'లో నటిస్తున్న చరణ్
- ఈ మూవీ తర్వాత సుకుమార్‌తో సినిమా
- ఈ చిత్రంతో పాటే త్రివిక్రమ్ మూవీ కూడా ఉంటుందని వార్తలు
- ఇప్పటికే చర్చలు జరగగా... చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ఉంటుందని టాలీవుడ్ టాక్.
రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో ఒక సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన ఉంది. ఈ మూవీతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు సీనియర్ హీరో వెంకటేశ్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. దీని తర్వాత చెర్రీ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయని, చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక, ఈ మెగా కాంబోపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, రామ్ చరణ్ నటన కలగలిసి ఒక అద్భుతమైన సినిమా వస్తుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ కాంబో కుదిరితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సో.. ఇప్పటినుంచే ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.