Krishna Actor: కోలీవుడ్ డ్రగ్స్ కేసు... నటుడు కృష్ణ కోసం గాలిస్తున్న ఐదు పోలీసు బృందాలు

- చెన్నైలో డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
- విచారణలో మరో నటుడు కృష్ణ పేరు వెల్లడి
- పరారీలో కృష్ణ... పోలీసుల గాలింపు
తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నటుడు శ్రీరామ్ ఇచ్చిన కీలక సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ పరిణామం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే, ఈ నెల 23న చెన్నైలోని నుంగంబాక్కం పోలీసులు నటుడు శ్రీరామ్‌ను డ్రగ్స్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మాజీ ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సభ్యుడు టి. ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్‌కు ప్రసాద్ కొకైన్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్న పోలీసులు శ్రీరామ్‌ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో శ్రీరామ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
తనతో పాటు డ్రగ్స్ తీసుకున్న మరికొందరి పేర్లను శ్రీరామ్ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. వీరిలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు కృష్ణ పేరు కూడా ఉండటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, శ్రీరామ్ అరెస్ట్ అయిన విషయం తెలియగానే నటుడు కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో, కృష్ణను పట్టుకునేందుకు చెన్నై పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళ పరిశ్రమలోని పలువురు యువ దర్శకులు, సంగీత దర్శకులతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సినీ పరిశ్రమ మరోసారి డ్రగ్స్ కేసుల భయంతో ఆందోళనకు గురవుతోంది.