Manchu Vishnu: మంచు విష్ణు కార్యాలయాల్లో ముగిసిన జీఎస్టీ అధికారుల సోదాలు ..కన్నప్ప మూవీ రికార్డులు స్వాధీనం

- మంచు విష్ణు కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల సోదాలు
- కన్నప్ప మూవీ రికార్డులు స్వాధీనం
- పన్ను ఎగవేత జరిగినట్లు ప్రాధమికంగా గుర్తింపు
నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉన్న ఆయన కార్యాలయాలలో ఏకకాలంలో రెండు ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.
కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.
కాగా, ఈ చిత్రం శుక్రవారం (27వ తేదీ) విడుదల కానుండగా, బుధవారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వెళ్లడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.