Manchu Vishnu: 'కన్నప్ప' అంటే ఓ సాహసం.. ఓ ప్రయోగం!

- మంచు విష్ణు బ్యానర్ నుంచి 'కన్నప్ప'
- రేపు విడుదలవుతున్న సినిమా
- భారీతనమే ప్రధానమైన బలం
- భారీ తారాగణం ప్రత్యేకమైన ఆకర్షణ
- అందరి దృష్టి వసూళ్ల పైనే
మంచు విష్ణు 'కన్నప్ప' ప్రాజెక్టును కదిలించగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కృష్ణంరాజు తరువాత ఆ కథ వైపు కన్నెత్తి చూసినవాళ్లు లేరు. కృష్ణంరాజు 'భక్త కన్నప్ప' 1976లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రోజుల్లో అది భారీ బడ్జెట్ సినిమా. ముళ్లపూడి వెంకటరమణ మాటలు .. బాపు దర్శక ప్రతిభ .. సత్యం సంగీతం .. రామకృష్ణ గానం .. కృష్ణంరాజు - రావు గోపాలరావు నటన ఆ సినిమాను ఆణిముత్యంగా మార్చాయి.
'భక్త కన్నప్ప' ఒక అద్భుతమైన కాంబినేషన్. మళ్లీ అలాంటి ఒక కాంబినేషన్ సెట్ కావడం అసాధ్యమనే ఎవరూ కూడా ఆ కథపై దృష్టిపెట్టలేదు. కానీ మంచు విష్ణు మళ్లీ ఈ కథను తన భుజాన వేసుకున్నాడు. వందల కోట్లతో ఈ సినిమాను నిర్మించాలనే ఆయన ఆలోచన ఒక సాహసమైతే, ఈ కథను న్యూజిల్యాండ్ కి తరలించడం ఒక ప్రయోగమని చెప్పాలి. దాదాపుగా అక్కడే ఈ సినిమాను చిత్రీకరించారు. రేపే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
'కన్నప్ప'ను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనే ఆలోచన ఉండటం వలన, ముఖ్యమైన పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్స్ ను తీసుకున్నారు. ఆ జాబితాలో మోహన్ లాల్ .. శరత్ కుమార్ .. అక్షయ్ కుమార్ కనిపిస్తారు. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాలో మెరవనుండటం మరో విశేషం. భారీతనం .. భారీ తారాగణం ఈ సినిమాకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో, వసూళ్ల పరంగా ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.