కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు.
 
నగర నడిబొడ్డున ఉన్న ఆల్ట ఓపెర్ నుండి సెంట్రల్ రైల్వేస్టేషన్ వరకు "కూటమి ఐక్యత వర్ధిల్లాలి", "సైకో పోవాలి..కూటమి రావాలి" అనే నినాదాలతో మూడు కిలోమీటర్ల మేర నడకయాత్ర చేశారు.
 
జర్మనీలో నివసిస్తున్న తెలుగు వారు అత్యధికంగా ఈ సారి ఎన్నికలకు వారి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరియు ఎన్నికల ప్రచారం కోసం భారతదేశం రావడం విశేషం.
 
ఓటు హక్కు లేని వారు లేదా వారి వృత్తి నుండి సెలవలు దొరకని వారు సామాజక మాధ్యమాల్లో, ఫోన్ కాల్స్ ద్వారా ఓటర్లకు కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు.
 
Content Produced by: Indian Clicks, LLC

More Press News