గత దశాబ్ద కాలంలో అత్యధికంగా వీక్షించిన టాప్ 100 భారతీయ నటుల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా గత పదేళ్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ నటి దీపికా పదుకొణె.

ముంబై, ఇండియా—మే 29, 2024 సినిమాలు, టీవి మరియు ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన IMDB (www.imdb.com) ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా  గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల జాబితాను ప్రకటించింది.

2007 లో ఓం శాంతి ఓం సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దీపికా పదుకొణె ఐఎండిబిలో గత 10 సంవత్సరాలలో అత్యధిక మంది వీక్షించిన భారతీయ నటిగా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో కాక్ టెయిల్, యే జవానీ హై దీవానీ, పద్మావత్ వంటి పలు బ్లాక్ బ్లాస్టర్స్ ను తన ఖాతాలో వేసుకుంది. 2017లో విన్ డీజిల్తో కలిసి నటించిన 'ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్' చిత్రంతో హాలీవుడ్ అరంగేట్రం చేసింది.

"ప్రపంచ ప్రేక్షకుల మనోభావాలను ప్రతిబింబించే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నందుకు కృతజ్ఞతలు.  ప్రజల అభిరుచి, ఆసక్తి, ప్రాధాన్యతల సరైన నాడిని ప్రతిబింబిస్తూ విశ్వసనీయతకు  ఒక దిక్సూచిగా IMDB నిలుస్తుంది. ఈ గుర్తింపును అందుకోవడం నిజంగా గర్వంగా ఉంది. ఇది  తెరపై మరియు తెర వెలుపల ప్రేక్షకుల నుండి నేను పొందే ప్రేమతో కనెక్ట్ అవ్వడానికి,  ప్రతిస్పందించడానికి ఇది నన్ను మరింత  ప్రేరేపిస్తుందని" దీపికా పదుకొణె అన్నారు. దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ (2024 జూన్ 27న విడుదల), సింగం ఎగైన్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

“గత కొన్నేళ్లుగా ఎంటర్ టైన్ మెంట్ అభిమానులు తమ అభిమాన తారల గురించి అప్ డేట్  తెలుసుకోవడం  కోసం IMDB పై ఆధారపడుతున్నారు. మా అధికారిక డేటాతో నడిచే ఈ ఖచ్చితమైన జాబితా, గత దశాబ్దంలో భారతదేశ వినోద రంగంలోని  పరిణామల గురించిన అంతర్దృష్టిని అందిస్తుంది" అని ఐఎండిబి ఇండియా హెడ్ యామిని పటోడియా అన్నారు.

  ప్రపంచవ్యాప్తంగా భారతీయ నటుల అపారమైన అభిమానాన్ని మేము పొందుతున్నప్పుడు, వర్ధమాన మరియు స్థిరపడిన ప్రతిభావంతులయిన నటులతో మరింత ఎక్కువగా కనెక్ట్ కావడానికి IMDB అభిమానులకు సహాయపడుతుంది.

IMDBలో గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ నటులు*

1. దీపికా పదుకొణె

2. షారుఖ్ ఖాన్

3. ఐశ్వర్య రాయ్ బచ్చన్

4. అలియా భట్

5. ఇర్ఫాన్ ఖాన్

6. అమీర్ ఖాన్

7. సుశాంత్ సింగ్ రాజ్ పుత్

8. సల్మాన్ ఖాన్

9. హృతిక్ రోషన్

10. అక్షయ్ కుమార్

11. కత్రినా కైఫ్

12. అమితాబ్ బచ్చన్

13. సమంత రూత్ ప్రభు

14. కరీనా కపూర్

15. త్రిప్తి డిమ్రీ

16. తమన్నా భాటియా

17. రణబీర్ కపూర్

18. నయనతార

19. రణ్వీర్ సింగ్

20. అజయ్ దేవగణ్

 
* ఐఎండిబి జాబితాలో గత దశాబ్దపు అత్యధికంగా వీక్షించబడిన టాప్ 100 భారతీయ నటులు జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు IMDB వీక్లీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా IMDBకు 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా ఈ ర్యాంకింగ్ లు నిర్ణయించబడతాయి. 100 మంది పేర్లతో కూడిన పూర్తి జాబితా ఐఎండిబిలో అందుబాటులో ఉంది. కావలంటే  ఇక్కడ చూడవచ్చు.


100 మంది తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు ఉండటం గమనార్హం. 1960లో బాల నటుడిగా అరంగేట్రం చేసిన కమల్ హాసన్ 54వ స్థానంలో ఉన్నారు. 2017లో అరంగేట్రం చేసిన త్రిప్తి డిమ్రీ 15వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న మన అభిమాన నటులు  ఇర్ఫాన్ ఖాన్ (నెం.5) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (నెం.7) 2020లో కన్నుమూశారు.  

 IMDBలో గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 100 భారతీయ నటుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి మరియు పూర్తి జాబితాను ఇక్కడ వీక్షించండి.

   

More Press News