తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధి: మంత్రి కొండా సురేఖ

తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. 

పర్యావరణానికి, వన్య ప్రాణులకు ఏ మాత్రం హాని కలగకుండా, వాటి సహజ ఆవాసాలను పరిరక్షిస్తూ, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సురేఖ తెలిపారు. శనివారం డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హా లులో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటి ఛైర్మన్, మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్సల్టేటివ్ కమిటి మెంబర్లు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొ జ్జా, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) పర్గెయిన్, పిసిసిఎఫ్ (కంపా) సువర్ణ, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా,స్టేట్ డైరక్టర్ ఫరీదా తంపల్, తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్కా ర్పోరేషన్ (ఎకో టూరిజం) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రంజిత్ నాయక్;; జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సెక్రటరీ(అటవీ) శ్రీలక్ష్మి, సిసిఎఫ్క్షి తిజ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఛైర్మన్ ఇమ్రాన్సిద్దిక్, ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ జిఎం ఉపేందర్ రెడ్డి, సిఐఐ మెంబర్శ్రీ దేవి రావు, డిఎఫ్ఓలు శివ ఆశిష్ సింగ్, నవీన్ రెడ్డి, సిద్ధార్థ్ వి సింగ్, కిష్టా గౌడ్, రాహుల్ కె జాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సరికొత్తగా ఆవిష్క రించనున్నామని మంత్రి సురేఖ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12 సర్క్యూట్ లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లుగా మంత్రి సురేఖ తెలిపారు. 

అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ, అడ్డంకులను అధిగమించుకుంటూ

సాగాలని అటవీ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు. ఆర్కియాలజీ శాఖతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని మంత్రి విమర్శించారు.

ఒడిషా, కర్నాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఆ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గమనించిన పరిస్థితులను ఇక్కడి పరిస్థితులతో బేరీజు వేసుకొని అత్యుత్తమ ఎకో టూరిజం పాలసీల రూపకల్పనకు కృషి చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన సమావేశంలో ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల, వలస పక్షుల ఆవాసాలు, జీవవైవిధ్య ప్రాంతాలు, వారసత్వ కట్టడాలున్న ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించిన విషయాన్ని మంత్రి సురేఖ అధికారులకు గుర్తు చేశారు.

“రాష్ట్రవ్యాప్తంగా ఎకో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేసేందుకు పిపిపి పద్ధతిలో నిధులను సమీకరించాలి. రాష్ట్రంలోని ప్రధాన నది అయిన గోదావరి నదీపరివాహక ప్రాంతంలోనూ, జలపాతాలు, నీటివనరులన్న ప్రాంతాల్లో ఎకో టూరిజం స్పాట్లను అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పథకాలు రచించాలి. ఎకో టూరిజం స్పాట్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని వెబ్ సైట్లలో అందించాలి. పూర్తిస్తాయిలో ఆన్లైన్బు కింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ఆయా పర్యాటక ప్రదేశాల్లో స్థానికులకు, మహిళా సంఘాలకు ఉపాధిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో స్టాళ్ళు ఏర్పాటు చేయాలి. సామాజిక బాధ్యతగా ఎకో టూరిజం స్పాట్లకు సెలబ్రిటీల ద్వారా ప్రచారం కల్పించాలి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్వహణ ఉండాలి ప్లాస్టిక్ ఫ్రీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. ఏ చిన్న ప్రాణికి కూడా
హాని కలగని విధంగా ఎకో టూరిజం పాలసీ రూపకల్పనను చేపట్టాలి” అని మంత్రి సురేఖ అధికారులకు సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీని రూపొందించే దిశగా కన్సల్టేటివ్ కమిటి ఒకడుగు ముందుకు వేసిందని మంత్రి సురేఖ తెలిపారు. ఈ సమావేశంలో క్రోడీకరించిన సమాచారాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత మరోమారు కన్సల్టేటివ్ కమిటి సమావేశమవుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

 

More Press News