అమ్మవారి అనుగ్రహమే 'పురాణపండ' నవరాత్రులకు అందించిన నాలుగు లావణ్యాల మంత్రపేటికలు

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో , వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత , హైదరాబాద్ జూబిలీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణ కుంకుమార్చనల్లో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ  శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన  'దుర్గే ప్రసీద', ‘దేవీం స్మరామి’, 'సౌభాగ్య' ,  'శ్రీనిధి ' గ్రంథాలు ఈ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మంత్రమయ స్తోత్ర వ్యాఖ్యాన గ్రంథం భక్తకోటికి కుంకుమార్చన ద్వారా, లడ్డూ కౌంటర్ల ద్వారా ,  ఆవిష్కరణోత్సవాల ద్వారా అమ్మవారి  అనుగ్రహంగా భక్త కోటికి చేరడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవని శ్రీ దుర్గామల్లేస్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.ఎస్.రామారావు సంతోషాన్ని వ్యక్తంచేశారు.

 ప్రధానంగా దుర్గాష్టమి పర్వదిన సాయంకాలవేళలో విజయవాడ ఇంద్రకీలాద్రి  వేదఘోషతో మారుమోగింది.  ఈ ప్రపంచాన్ని సమృద్ధం చేసే అక్షయ ధైర్యాల వేదఘోష వందమందికి పైగా వేదపండితుల ఉదాత్త అనుదాత్త స్వరాలతో అమ్మవారికి నీరాజనంగా సమర్పించబడటం గురువారంరోజు వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది.   ఈ అద్భుత వైదిక కార్యానికి భారతదేశ నలుమూలనుండి హాజరైన పండితులకు ఆలయ సిబ్బంది, ఆలయ ఉత్సవ కమిటీ వేద పండితులకు నగదు సత్కారంతోపాటు ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన '  పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప లావణ్యాల పవిత్ర  'దేవీం స్మరామి' గ్రంథాన్ని వందకు పైగా హాజరైన ఘానపాఠీలకు, వేద పండిత బృందాలకు బహూకరించడం అందరినీ తన్మయింప చేసింది.

వేదపఠనం సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి, కమిషనర్ జె . సత్యనారాయణ , దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.ఎస్.రామారావు తదితర ప్రముఖులు హాజరై వేదఘోషను విని వందలమంది పండిత బృందాలకు అభివాదాలకర్పించారు.

 ఈ అపురూప మంత్ర పేటికను మాకు అమ్మ దుర్గమ్మ అనుగ్రహంగా దేవస్థానంలో ఈ వేదఘోషల మధ్య మంత్ర ప్రసాదంగా ఆనం రామనారాయణరెడ్డి ప్రోత్సాహంతో ఈ ఓ రామారావు బహూకరింపచేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని  వేదపండిత బృందం ముక్త కంఠంతో ప్రశంసించడం ఈ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకతగానే చెప్పాలి. రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో దశాబ్దాలుగా జరుగుతున్న మహోన్నతమైన దేవీ ఉత్సవాల్లో ఈ సంవత్సరం పురాణపండ ' సౌభాగ్య ' గ్రంధం ప్రధానంగా ఆకర్షించింది.

      

More Press News