కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి: హీరో కిరణ్ అబ్బవరం

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం "లవ్ రెడ్డి" . కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ప్రేమకథ చిత్రానికి స్మరన్ రెడ్డి దర్శకుడు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా  "లవ్ రెడ్డి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


డైరెక్టర్ స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ - అంజన్ రామచంద్ర నేను రెండేళ్ల కిందట లవ్ రెడ్డి మూవీ స్టార్ట్ చేశాం. అంజన్ మా మూవీ ముందుకు వెళ్లేలా ఎంతో కష్టపడ్డాడు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ పది మంది అయ్యారు. ఎంతో నమ్మకంతో మా మూవీని రిలీజ్ దాకా తీసుకొచ్చాం. రీసెంట్ గా హిందూపూర్ లో ప్రివ్యూస్ వేశాం. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ మూవీగా లవ్ రెడ్డి మీ ముందుకు వస్తోంది. శ్రావణి పర్ ఫార్మెన్స్ చూస్తే ఈ క్యారెక్టర్ ఆమె తప్ప మరో హీరోయిన్ చేయలేరు అనిపిస్తుంది. మ్యూజిక్ ప్రిన్స్ హెన్రీ సూపర్బ్ గా ఇచ్చారు. మా లవ్ రెడ్డి మూవీని చూసి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ - ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం కష్టం. చాలా డెడికేషన్  తో నా ఫ్రెండ్ కిరణ్ ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. అతని సక్సెస్ పట్ల సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో సకుటుంబంగా చూసే ప్రేమకథలు రావడం లేదు. అలాంటి ప్రేమ కథలు రాయడం తెరకెక్కించడం కూడా కష్టం. కానీ మా డైరెక్టర్ స్మరణ్ అందరికీ నచ్చే, అందరూ చూసే లవ్ స్టోరీని రాశాడు. నిజంగా మా స్మరణ్ గ్రేట్. లవ్ రెడ్డి సినిమాతో ఒక మంచి డైరెక్టర్, మంచి హీరో, మంచి హీరోయిన్ మీకు పరిచయం కాబోతున్నారు. మా సినిమా చూసి మైత్రీ మూవీ వాళ్లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ కర్ణాటకలో రిలీజ్ చేస్తోంది. రీసెంట్ గా హిందూపూర్ లో షోస్ వేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - నేనూ, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. ఆ ఎమోషనల్ బాండింగ్ మా మధ్య ఉంది. చాలా మంది ఇక్కడ కష్టాలు పడలేక, ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెళ్లిపోయారు. అంజన్ గట్టిగా నిలబడి ఉన్నందుకు అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా లవ్ రెడ్డి సినిమా కోసం కష్టపడుతున్నారు. ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్  చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను. అంజన్ కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లిపోయే ఉద్దేశం లేదు. తను మంచి స్థాయికి చేరుకోవాలి. శ్రావణి తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఆమె మాట్లాడిన స్పీచ్  కైనా సినిమాకు వెళ్లండి. నా క సినిమా  ఈనెల 31న రిలీజ్ అవుతోంది. లవ్ రెడ్డి 18న వస్తోంది. నా సినిమా రెండు రోజులు ఆగి చూసినా ఫర్వాలేదు. లవ్ రెడ్డి మాత్రం వెంటనే చూసేయండి. సినిమా మీద ఎంతో ప్రేమ ఉన్న ఇలాంటి టీమ్ సక్సెస్ కావాలి. లవ్ రెడ్డి సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ వారికి, ఆంధ్రలో రిలీజ్ చేస్తున్న వంశీ గారికి, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్న హోంబలే సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

More Press News