'కేసీఆర్' చిత్రానికి రాజకీయాలకు సంబంధం లేదు: రాకింగ్‌ రాకేష్‌

జబర్థస్త్‌ ఫేం రాకింగ్‌ రాకేష్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం కేసీఆర్‌ (కేశవ చంద్ర రమావత్‌). గరుడ వేగ అంజి దర్శకుడు. 
అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ ఈ చిత్రాన్ని తన సొంత సంస్థపై నిర్మించారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు సాయి రాజేష్‌, అనసూయ విడుదల చేశారు. 

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని మూడు ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాలని నా కోరిక. దానికి మీరందరూ సపోర్ట్ కావాలి. అనసూయ గారు నన్ను జీరో దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఒక అమ్మలా చుసుకున్నారు. వారు ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా వుంది. డైరెక్టర్ అంజన్న సినిమాని చాలా ఫ్యాషన్ తో తీశారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఒక బిడ్డ లాగా అన్ని నేర్పించారు. ఎన్ని క్రాఫ్ట్ లు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్ లు నేర్పించారు. చరణ్ అర్జున్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన త్వరలో బిగ్ బ్యానర్స్ లో పనిచేయబోతున్నారు. నా సక్సెస్ కారణం నా భార్య సుజాత. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు. 

డైరెక్టర్ అంజి మాట్లాడుతూ..రాకేష్ చాలా అద్భుతమైన కథను రాశారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ రెండు నేనే చేశాను. వండర్ఫుల్ కథ తీసుకువచ్చిన రాకేష్ కి థాంక్యూ సో మచ్. మా ట్రైలర్ లాంచ్ చేసిన సాయి రాజేష్ గారు అనసూయ గారికి థాంక్యూ సో మచ్ వారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు ఎంకరేజ్ చేయడం నిజంగా మాకు ఒక సక్సెస్ అన్నారు. 

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్ కి రాకేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేసి వెళ్ళాడు. ఆ కృతజ్ఞత నాకు అలా ఉండిపోయింది. కొన్ని రోజులుగా ముంబైలో ఉన్నప్పటికీ రాకేష్ కోసం ఈ ఈవెంట్ కి వచ్చాను. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన రాకేష్ కి ఈ వేదిక పైన థాంక్స్ చెప్తున్నాను. తనకి కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. తొందరలోనే ఆ క్యారెక్టర్ రాసి రుణం తీర్చుకుంటాను. సినిమా తీసి చూస్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేష్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అంజి గారు మంచి దర్శకులు మంచి కెమెరామెన్. అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' చెప్పారు. 

అనసూయ మాట్లాడుతూ... . రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్ గా అనిపించింది. అంజి గారు చాలా బ్రిలియంట్ గా ఈ కథని తీశారు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆడియన్స్ కూడా అంతే హానెస్ట్ గా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్' అన్నారు. 


More Press News