మా అమ్మ గర్వపడే సినిమా ఇది : అనన్య నాగళ్ల
''సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు క్యూట్ లవ్‌స్టోరీస్ చేద్దామని అనుకున్నాను. కానీ నాకు మిస్టర్ మల్లేశం లాంటి చిత్రాల్లో మెచ్యూర్డ్ పాత్రలు లభించాయి. ఆ తరువాత ప్రేక్షకులు నన్ను ఓ డిఫరెంట్ లుక్‌లో చూశారు. దీనివల్ల ఒక డిఫరెంట్ సెట్ అప్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కావాలంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు లో నా పేరు కూడా వినిపిస్తుంది'' అన్నారు అనన్య నాగళ్ల. ఆమె కథానాయికగా నటించిన చిత్రం పొట్టేల్. యవ చంద్ర కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి సాహిత్ దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం అనన్య నాగళ్ల పాత్రికేయులతో ముచ్చటించారు.
'పొట్టేల్' మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందులో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
ఈ ప్రాజెక్ట్ గురించి మొదట నిర్మాత నిశాంక్ గా కాల్ చేసి చెప్పారు. తర్వాత డైరెక్టర్ సాహిత్ కథ చెప్పారు. కథ చాలా బావుంది. అయితే ఇంతకుముందు మదర్ గా ఒక వెబ్ సిరిస్ చేశాను. మళ్ళీ మదర్ అంటే సిమిలర్ అవుతుందేమో అనుకున్నాను. అయితే ఇందులో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. ఇంత మంచి కాన్సెప్ట్, కథలో ఎలా అయిన పార్ట్ కావాలని చేశాను. చేసిన తర్వాత తెలిసింది, ఆ సిరిస్ లో చేసిన రోల్ కి ఇందులో రోల్ కి కంప్లీట్ డిఫరెన్స్ వుంది. ఎక్కడా పోలిక లేదు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ట్రైలర్ లో ఎక్కువ రివిల్ చేయలేదు. సినిమాలో అందరూ సర్ ప్రైజ్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్ సాబ్ అనన్య అనే పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు చెప్పినట్లుగా చేశాను.
ట్రైలర్ రిలీజ్ తర్వాత రియాక్షన్స్ ఏమిటి ?
-అన్ఎక్స్పెక్టెడ్ గా చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేసి ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పారు . వకీల్ సాబ్ మినహిస్తే నా నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని చెప్పారు.
'పొట్టేల్' టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
-పొట్టేల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ నేచర్. ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చిన ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వచ్చే సమస్య లేదు. అలా రెండు విధాలుగా ఈ సినిమా టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చింది.
ఈ సినిమాలో మేజర్ హైలెట్స్ ఏమిటి?
-స్టోరీ లైన్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్. కమర్షియల్ ఎలిమెంట్స్ ని, మెసేజ్ ని, తెలంగాణ కల్చర్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన సినిమా ఇది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. యువ, పాప మధ్య వచ్చే సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలా ఎమోషనల్ గా ఉంటాయి. కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ లు అద్భుతంగా ఉంటాయి.
ఈ సినిమాలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
-కథ, క్యారెక్టర్, డైరెక్టర్ అప్రోచ్ అయ్యే విధానం బాగుంటే సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం అని అర్థమైంది. సినిమాకి ఏం కావాలి, ఎంత పెట్టాలి అనేది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఒక ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వస్తుంది. సినిమాని ఆడియన్స్ వరకు ప్రొడ్యూసర్స్ తప్ప మరెవరూ తీసుకెళ్లలేరు. అది ఈ సినిమాతో అర్థమైంది. డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కి కూడా ఫ్యాషన్ ఉంటేనే ఒక కథని ఆడియన్స్ వరకు రీచ్ చేయగలరు. సురేష్ అండ్ నిశాంక్ ఇద్దరు పర్ఫెక్ట్ కాంబినేషన్. వారిద్దరి కాంబినేషన్ వల్ల ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది.
మీకు వస్తున్న క్యారెక్టర్స్ పట్ల హ్యాపీగా ఉన్నారా ?
-ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్ని లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ చేద్దామనుకున్నాను. అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. మల్లేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఒక డిఫరెంట్ లుక్ లో చూశారు. మెచ్యూర్ గా చేస్తున్నాను కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దామని అనుకున్నారు. ఈ విషయంలో హ్యాపీగానే ఉంది. దీనివల్ల ఒక డిఫరెంట్ సెట్ అప్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రూల్స్ కావాలంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు లో నా పేరు కూడా వినిపిస్తుంది. అందుకే పొట్టేల్ లాంటి స్టోరీస్ వస్తున్నాయని భావిస్తున్నాను. మా అమ్మగారు ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాల గురించి ?
-శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్ కి రెడీగా వుంది. సతీష్ వేగేశ్న గారి కథకళి సినిమా జరుగుతుంది. 'లేచింది మహిళా లోకం'అనే సినిమా చేస్తున్నాను.