"క" సినిమాలో వున్న ట్విస్ట్‌లు అందరిని సర్‌ఫ్రైజ్‌ చేస్తాయి: నయన్‌ సారిక, తన్వీరామ్‌

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  లేటెస్ట్ ఇంటర్వ్యూలో "క" సినిమా హైలైట్స్ తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్.

నయన్ సారిక మాట్లాడుతూ ''గం గం గణేశాలో మోడరన్ గా ఉంటాను, ఆయ్ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఆయ్ లో పల్లవి క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. ఆ పాత్రకు భిన్నమైన రోల్ చేయాలని కోరుకున్నా. అనుకున్నట్లుగానే "క" సినిమాలో సత్యభామ పాత్ర దక్కింది. ఈ చిత్రంలో పూర్తిగా ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఈ మూవీ కథ విన్నప్పుడు క్లైమాక్స్ మనసులో గుర్తుండిపోయింది. థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు."క" లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నాం. హీరో ఎవరికి పెయిర్ అనేది మూవీలోనే చూడాలి. ఈ కథలో ఎన్నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ చెబితే ఆ కిక్ థియేటర్ లో మిస్ అవుతుంది. అందుకే ఎక్కువగా రివీల్ చేయడం లేదు. నేను తన్వీ కలిసి చేసిన సీన్స్ తక్కువ. తక్కువ టైమ్ లో మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సినిమా టీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోయిన వర్క్ చేశారు. క సినిమా టైటిల్ హీరో క్యారెక్టర్ వాసుదేవ్ కు కనెక్ట్ అయి ఉంటుంది.

ఈ సినిమాలో నా సత్యభామ క్యారెక్టర్ లుక్ కోసం సావిత్రి గారి లుక్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారు. అందుకే హీరో నేను సావిత్రిలా ఉన్నానని డైలాగ్ చెబుతాడు. సావిత్రి గారిలా నేను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ల సీన్ చేయగలను. ఆమె మహానటి చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యాను. నా సత్యభామ క్యారెక్టర్ ను సావిత్రి గారిలా ఉన్నానని హీరో చెప్పే డైలాగ్ చాలా రిలవెంట్ గా ఉందని డైరెక్టర్స్ అన్నారు.  మా డైరెక్టర్స్ సందీప్ సుజీత్ ఇద్దరూ ఒకే థాట్ ప్రాసెస్ తో ఉండేవారు. వాళ్లు ఎక్కడా డిఫరెన్స్ రాకుండా బాగా మూవీని తెరకెక్కించారు.


హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ
నేను తెలుగులో నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాలో నటించాను. ఆ సినిమా కథలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించాను. ఒక సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. హీరోయిన్ గానే కనిపించాలని అనుకోవడం లేదు. "క" సినిమాలో రాధ అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ సందీప్ నాకు ఫోన్ లో కొంత నెరేషన్ ఇచ్చారు. నేను పూర్తిగా వినాలని చెబితే కంప్లీట్ స్క్రిప్ట్ నా క్యారెక్టర్ తో సహా చెప్పారు. రాధ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. వెంటనే ఒప్పుకున్నాను. 

- రాధ ఒక స్కూల్ టీచర్. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్ లో కనిపిస్తే, నేను మరో పీరియడ్ లో కనిపిస్తా. నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. సత్యభామ పాత్రతో నాకు సీన్స్ ఉండవు. క సినిమా రిలీజ్ అయ్యాక నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నా. ఇప్పుడే చెబితే థ్రిల్ రివీల్ అవుతుంది.

 ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది. కృష్ణగిరి అనే ఊరు కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్ లు టర్న్స్ ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం మరో స్థాయిలో ఉంటుంది. మా అందరినీ కథకు బాగా కనెక్ట్ చేసింది పతాక సన్నివేశాలే. మొత్తం సినిమా సమ్మరీ చెప్పాలంటే క టైటిల్ లోనే ఉంది. కథలోని ఎన్నో ఎమోషన్స్ మా క్యారెక్టర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. 

నేను చేసిన రాధ క్యారెక్టర్ ఎక్కువ నైట్ షూట్స్ చేశారు. నేను ఎర్లీగా నిద్రపోతుంటా. నైట్ షూట్ కాబట్టి మెలకువగా ఉండాల్సివచ్చింది. ఇది ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాగే నేను సరదాగా నవ్వుతూ ఉంటాను. రాధ క్యారెక్టర్ కొన్నిసార్లు ఏడవాల్సిఉంటుంది. ఆ లాంగ్ సీక్వెన్స్ సీన్స్ అనేకసార్లు, వివిధ యాంగిల్స్ లో షూట్ చేశారు. అప్పుడు మళ్లీ మళ్లీ అదే ఎమోషన్ తో ఏడవాల్సివచ్చింది. ఇలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ కు భిన్నంగా సెట్ లో ఉండటం వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపించింది. అయితే నటిగా నేను ఇవన్నీ వృత్తిలో భాగంగా తీసుకోవాల్సిందే.

- క సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. క సినిమాకు సెకండ్ పార్ట్ కు లీడ్ ఉంటుంది. కానీ సీక్వెల్ గురించి తర్వాత చెబుతాం. ప్రస్తుతం తమిళం, మలయాళంలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. క రిలీజ్ తర్వాత తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా

More Press News