తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించింది: మంత్రి నిరంజన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి మూలంగా సవాళ్లను ఎదుర్కోగలిగాం
గ్రామీణ వ్యవస్థ బలోపేతం చేయడంకోసం అనేక చర్యలు చేపట్టాం
60 శాతం జనాభా ఉన్న, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామీణ ప్రాంతాలు నిలదొక్కుకోవాలన్నదే లక్ష్యంగా భావించాం
మిషన్ కాకతీయతో 46 వేల చెరువుల పునరుద్దరణ
దీంతో ఈ చెరువుల పరిధిలోని వ్యవసాయ ఆధారిత ప్రజలకు 78 శాతం ఆదాయం అదనంగా పెరిగింది
చెరువులలో ఉచితంగా చేపపిల్లలు విడుదల చేయడం మూలంగా మత్య్సకారుల ఆదాయం 35 శాతం పెరిగింది
265 టీఎంసీల నీటి నిలువ సామర్ధ్యాన్ని చెరువుల ద్వారా పునరుద్దురించుకున్నాం
మిషన్ భగీరధతో రూ.43,791 కోట్ల వ్యయంతో 2.32 కోట్ల జనాభా ఉన్న 20.60 లక్షల ఆవాసాలకు శుద్దజలం తాగునీరు అందించే పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేశాం
రాష్ట్రంలోని 58.33 లక్షల రైతులకు 1.43 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది
వీరందరికీ రైతుబంధు పథకం అమలు చేయడం జరుగుతుంది. ఏడాదికి రెండు సార్లు వారికి పంట పెట్టుబడి కింద ప్రభుత్వ సాయం అందుతుంది
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తనకేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది
ప్రతిష్టాత్మక ఇస్టా 32వ సదస్సు తొలిసారి ఆసియాలో అదీ తెలంగాణలో నిర్వహించుకోవడం జరిగింది
ఈ సదస్సు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రతిష్ట మరింత పెరిగింది - ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓ ఇంజనీరింగ్ అద్భుతం
రూ.80 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో కేవలం మూడేళ్లలో పూర్తయింది
ప్రపంచంలోనే ఎవరూ చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుభీమా పథకం చేపట్టారు
ప్రభుత్వమే భీమా చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట
రైతులు, ప్రభుత్వం, బ్యాంకులను అనుసంధానం చేసే సంస్థ నాబార్డు
తెలంగాణ సంక్షేమ, అభివృద్ది పథకాలకు నాబార్డు అందిస్తున్న సాయం మరవలేనింది
భవిష్యత్ లో ఈ సహకారాన్ని కొనసాగించాలి
నాబార్ఢు 38 వార్షికోత్సవ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పాల్గొన్న ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫకీర్ సామి, రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, నాబార్డ్ ఫార్మర్ చైర్మన్ కోటయ్య, ఏపీ నాబార్డ్ సీజీఎం సెల్వరాజ్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం విజయ్ కుమార్ తదితరులు