థ్రిల్లింగ్ రెడ్ బుల్ నేమర్ జూనియర్స్ ఫైవ్ వరల్డ్ ఫైనల్‌కు రంగం సిద్ధం

  • అతిపెద్ద ఫైవ్-ఏ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 4వ ఎడిషన్
  • ఆరు ఖండాల్లోని 40కి పైగా దేశాల నుంచి పాల్గొన్న 100,000 మందికి పైగా ఆటగాళ్లు
  • కలీనా నుంచి సావో పాలో వరకు - నేమర్ జూనియర్స్ ఫైవ్ 2019 నేషనల్ ఛాంపియన్లుగా కలినా రేంజర్స్

వరల్డ్ ఫైనల్‌లో పోటీ పడడంతో పాటు నేమర్ జూనియర్‌ను కలిసే అవకాశం కోసం ముంబయ్ నుంచి బ్రెజిల్ ప్రయాణం

ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫైయింగ్ పోటీల తర్వాత, ప్రయా గ్రాండేలో బెస్ట్ ఫైవ్-ఏ-సైడ్ జట్లు తుది పోరుకి సిద్ధమైన నేపథ్యంలో, అందరి చూపు ఇప్పుడు బ్రెజిల్ మీదకు మళ్లింది. 2019, జూలై 12-13 తేదీల్లో బ్రెజిల్ వేదికగా ఈ రెడ్ బుల్ నేమర్ జూనియర్స్ ఫైవ్ వరల్డ్ ఫైనల్ జరగనుంది.

ఈ 4వ ఎడిషన్‌లో భాగంగా, ఆరు ఖండాల్లోని 40కి పైగా దేశాల్లోని 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 100,000 మందికి పైగా ప్లేయర్లు క్వాలిఫైయింగ్ కోసం పోటీ పడిన తర్వాత, ఇప్పుడు ప్రయా గ్రాండేలోని ఇనిస్టిట్యూటో ప్రొజెటో నేమర్‌లో ఫైనల్ కలను నిజం చేసుకోవడానికి నేషనల్ ఛాంపియన్లు సిద్ధమయ్యారు. ప్రపంచపు అతిపెద్ద మరియు అత్యంత ఉత్కంఠభరిత ఫైవ్-ఏ-సైడ్ టోర్నమెంట్ ఫార్మాట్‌లో 10 నిమిషాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగే ఈ పోటీలో గోల్‌కీపర్ ఉండరు. అయితే, ఒక జట్టు గోల్ చేసిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టు ఒక ప్లేయర్‌ని కోల్పోవడం ద్వారా చివరకు ఒక జట్టు విజేతగా నిలుస్తుంది. ఒక మిక్స్డ్ టీమ్ మరియు ఒక మహిళా జట్టు చివరకు ప్రపంచ ఛాంపియన్లుగా నిలవనున్నాయి.

ఏదైనా సాధ్యమే అని నిరూపించే స్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా నింపడమే ప్రధాన లక్ష్యంగా రెడ్ బుల్ నేమర్ జూనియర్స్ ఫైవ్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, గడచిన కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్త క్వాలిఫైయర్లు తమ పుష్కలమైన నాటకీయత మరియు ఉద్విగ్నభరిత పోరాటాలతో ఈ సందేశాన్ని ప్రతిధ్వనింపజేశారు.

మొత్తం 3216 జట్లు మైదానంలో తమదైన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, వాటి నుంచి ఎంపికైన నేషనల్ ఛాంపియన్ జట్లలో కలినా రేంజర్స్ ముంబయ్ సైతం నేమర్స్ జూనియర్స్ ఫైవ్ 2019 నేషనల్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఆంథోనీ మకాడో, టైసన్ పెరీరా, హెండర్సన్ డియాస్, రేయాన్ షైక్, క్రైగ్ డిసౌజా, మెల్విన్ బ్రబోజా మరియు ఛార్నెల్ డి’అల్మిడా ఇప్పుడు 2019 జూలై 12-13 మధ్య బ్రెజిల్‌లోని ఇనిస్టిట్యూటో నేమార్‌లో జరిగే వరల్డ్ ఫైనల్స్ 2019లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే, పారీస్ సెయింట్ జెర్మియన్ సూపర్‌స్టార్‌ను ఆయన సొంత గడ్డ మీద కలవనున్నారు.

విజయం సాధించిన కలినా రేంజర్స్ జట్టు సభ్యుడైన ఆంథోనీ మకాడో మాట్లాడుతూ, “రెడ్ బుల్ నేమార్ జూనియర్స్ ఫైవ్ 2019 నేషనల్ ఫైనల్స్ విజయంతో మేము అత్యంత సంతోషంతో ఉన్నాము. ఈ టోర్నమెంట్ ప్రారంభం ముందు నుంచే చాలాకాలంగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎందుకంటే, ఫైనల్స్ లో బెస్ట్ 5-ఏ-సైడ్ జట్లతో మేము తలపడాల్సి ఉంటుందని మాకు తెలుసు. భారతదేశంలోని యువత మరియు భవిష్యత్ తరం ఫుట్‌బాలర్ల స్వప్నానికి రెక్కలు తొడిగే విధంగా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నందుకు ఎనర్జీ డ్రింక్ దిగ్గజం రెడ్ బుల్‌కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బ్రెజిల్‌లో జరిగే వరల్డ్ ఫైనల్స్ లో మేము భారత్ తరఫున బరిలో నిలవడం మాకు గర్వంగా ఉంది. అలాగే, పారిస్ సైంట్ జెర్మైన్ సూపర్‌స్టార్‌ని ఆయన సొంత గడ్డ మీదే కలవబోతుండడం సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా నేను గత 7-8 సంవత్సరాలుగా ఫుట్సల్‌ తరఫున ఆడుతున్నాను. ఈ ఫార్మాట్ నిజంగానే నాలో ఉద్వేగం రేపింది. ఎందుకంటే, దీని వేగవంతమైన స్వభావం వల్ల మొత్తం గేమ్‌ని ఒకే ల్యాప్స్ గా భావించి గోల్స్ లో పైచేయి సాధించడానికి మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మా నైపుణ్యాలు ప్రదర్శించడానికి మరియు ఫీల్డ్ ఫుట్‌బాల్‌కి భిన్నంగా ఫీల్డులో సామర్థ్యం ప్రదర్శించడానికి ఫుట్సల్ మాకు అవకాశం కల్పించింది. అందుకే, ఇది నాలో గొప్ప స్ఫూర్తిని నింపింది ” అన్నారు.

బ్రెజిల్ వేదికగా గత ఏడాది జరిగిన వరల్డ్ ఫైనల్స్ లో నేమార్ జూనియర్స్ ఫైవ్ 2018 నేషనల్ ఛాంపియన్స్ జోగా బొనిటో ముంబయ్ భారత్ తరఫున పోటీ పడింది. నాకౌట్ రౌండ్‌కి చేరడం కోసం జరిగిన మ్యాచ్‌లలో చిలీ మరియు లాక్సెంబర్గ్ మీద చారిత్రక విజయాలు నమోదు చేసింది. నేమార్ జూనియర్స్ ఫైవ్ వరల్డ్ ఫైనల్స్ లో భారత్ మొట్టమొదటిసారిగా ఒక మ్యాచ్ గెలవడమే కాకుండా 32వ రౌండ్ (నాకౌట్ రౌండ్స్)కి అర్హత కూడా సాధించింది.

క్వాలిఫైయర్లలో ఇతరుల విజయగాథల విషయానికొస్తే, డల్లాస్ ఎఫ్.సి అనే యు.ఎస్.ఏ మహిళా జట్టు ఫ్లోరిడా లోని క్వాలిఫైయింగ్ వేదిక నుంచి చివరి అవకాశం సాధించడం కోసం టెక్సాస్ నుంచి రాత్రికి రాత్రి ఆ మ్యాచ్ కోసం వెళ్లింది. అలాగే, నమీబియాకి చెందిన మెర్కురీ సిటీ సైతం ఒక నెల ముందే కలసి ఆడినప్పటికీ, చివరకు వైల్డ్ కార్డ్ స్థానం సాధించింది. చివరకు ఫైనల్‌లో గొప్ప విజయం సాధించింది. స్పానీష్ జట్టు జరితోటి సైతం ఒక అత్యంత ప్రత్యేకమైన ప్రయాణం సాగించింది. సామాజిక బహిష్కరణ ప్రమాదం ఎదుర్కొంటున్న పిల్లల కోసం ఏళ్ల క్రితం స్థాపించిన ఫుట్‌బాల్ స్కూల్ నుంచి ఆ స్థాయికి చేరింది.

ప్రతిదేశం నుంచి వచ్చే అత్యుత్తమ జట్లతో పాటు ఈసారి ఈ టైటిల్ కోసం ఒక అంతర్జాతీయ జట్టు సైతం పోటీ పడనుంది. జూనియర్స్ గ్లోబల్ ఫైవ్ కాంపిటీషన్ విజేతలతో ఈ జట్టు రూపొందింది. ప్రపంచవ్యాప్త ప్లేయర్లు వారి ఇన్‌స్టాగ్రామ్ ఛానెళ్లలో తమ #ఔట్‌ప్లేదిమాల్ నైపుణ్యాలు పోస్టింగ్ చేయడం ద్వారా ఈ జట్టులో స్థానం సాధించారు. ఈ వేర్వేరు ఆటగాళ్లు కలసి జూనియర్స్ గ్లోబల్ ఫైవ్ అనే ఒక అంతర్జాతీయ జట్టుని ఏర్పరిచే ప్రత్యేక అవకాశంతో పాటు బ్రెజిల్‌లో రెండు రోజులు కలసి శిక్షణ పొందే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ శిక్షణ తర్వాత వారు వరల్డ్ ఫైనల్‌లో పాల్గొంటారు. తమ స్వదేశాల తరఫున ఆడే 42 నేషనల్ ఛాంపియన్ జట్లు కూడా ఇందులో పాల్గొంటాయి.

ఈ వరల్డ్ ఫైనల్ మ్యాచ్‌లు జూలై 12న శుక్రవారం నుంచి గ్రూప్ దశతో మొదలుకానున్నాయి. అత్యుత్తమ జట్లు శనివారం జరిగే నాకౌట్ ఫార్మాట్‌లోకి ప్రవేశిస్తాయి. చివరగా అగ్రశ్రేణి డు మహిళా జట్లు మరియు మిక్స్డ్ జట్లు ప్రతి విభాగం నుంచి ఒకదానితో ఒకటి ఫైనల్‌లో తలపడుతాయి. ఈ వరల్డ్ మ్యాచ్‌లో లభించే ట్రోఫీ మరియు ఛాంపియన్ హోదా సంగతి పక్కనపెడితే, నేమార్ జూనియర్ రూపొందించిన జట్టుతో తలపడే అవకాశమనేది ఈ జట్లకి జీవితంలో ఒకేసారి వచ్చే ఒక అపూర్వ అవకాశం. మిక్స్డ్ జట్టు గురించి ఇంకా ప్రకటించనప్పటికీ, బ్రెజిలియన్ నేషనల్ టీమ్ నుంచి వచ్చిన అండ్రెస్సా ఆల్వస్ (ఎఫ్.సి బార్సిలోనా), క్రిస్టైన్ (సావో పాలో ఎఫ్.సి), కలాన్ (మాజీ శాంటోస్), లుడిమిల్లా (అట్లెటికో డీ మ్యాడ్రిడ్), ఎరికా, టామిర్స్ (ఇద్దరూ కొరింథియన్స్ ఎఫ్.సి)తో పాటు అమందిన్హా (ఫట్సల్) మరియు నథాలియా గిట్లర్ (ఫుట్‌వ్యాలీ) లాంటి స్టార్లతో నిండిన జట్టుతో తలపడేందుకు మహిళా ఛాంపియన్లు సిద్ధమయ్యారు.

సుదీర్ఘమైన క్వాలిఫైయింగ్ ప్రయాణం తర్వాత, ఇప్పుడు రెండు రోజుల థ్రిల్లింగ్ ఫుట్‌బాల్‌కి ఈ టోర్నమెంట్ సిద్ధమైంది. ఫైనల్‌లోనూ సత్తా చాటడానికి ఈ జట్లు ఇప్పుడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.


రెడ్ బుల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం: 

అన్ని పిచ్‌ల నుంచి గ్రూప్ ఫేజ్ మ్యాచ్‌లను జూలై 12 మధ్యాహ్నం 3:00 గంటలు CEST (సాయంత్రం 6.30 గంటలు IST) నుంచి రెడ్ బుల్ టీవీలో (పిచ్‌లు ఎంపిక చేసుకోవచ్చు) ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఫైనల్స్ పోటీలు జూలై 13, శనివారం మధ్యాహ్నం 3:50 గంటలు CEST (రాత్రి 7.20 గంటలు IST)కి రెడ్ బుల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
https://www.redbull.com/int-en/events/AP-1ZE9AJ4K11W11


రెడ్ బుల్ నేమార్ జూనియర్స్ ఫైవ్ గురించి:

రెడ్ బుల్ నేమార్ జూనియర్స్ ఫైవ్ అనేది బ్రెజిలియన్ స్టార్‌కి చెందిన సిగ్నేచర్ ఫైవ్-ఏ-సైడ్ టోర్నమెంట్. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రపంచవ్యాప్త ఆటగాళ్ల ఫుట్‌బాల్ స్వప్నం నిజం చేయడానికి వారిని ఒకే వేదిక మీదకు తెచ్చే టోర్నమెంట్ ఇది. ఇదొక వేగవంతమైన, సాంకేతిక మరియు తమాషా నిండిన పోటీ. 6 ఖండాలకు చెందిన 40కి పైగా దేశాల్లో క్వాలిఫైయర్ల ఎంపిక కోసం టోర్నమెంట్ నిర్వహిస్తారు. క్వాలిఫైయర్లు కావడం కోసం అక్కడి జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీ పడుతాయి. నేషనల్ ఫైనల్‌లో విజయం ద్వారా వరల్డ్ ఫైనల్‌కు చేరుతాయి. ఈ క్రమంలోనే నాలుగవసారి ఈ టోర్నమెంట్‌ని బ్రెజిల్‌లోని ప్రయా గ్రాండేలో ఉన్న ఇనిస్టిట్యూటో ప్రొజెటో నేమార్ జూనియర్‌లో నిర్వహించనున్నారు. www.redbullneymarjrsfive.com

ఇనిస్టిట్యూటో ప్రొజెటో నేమార్ జూనియర్ గురించి:

వరల్డ్ ఫైనల్‌కు వేదిక కానున్న ఇనిస్టిట్యూటో ప్రొజెటో నేమార్ జూనియర్ అనేది ఒక ప్రైవేట్, లాభాపేక్ష రహిత సంస్థ. సామాజిక సేవ కోసం నేమార్ జూనియర్ మరియు ఆయన కుటుంబం దీనిని ఏర్పాటు చేసింది. నేమార్ జూనియర్ తన చిన్నతనంలో ఎక్కువ రోజులు గడిపిన ప్రయా గ్రాండేలోని జర్డిమ్ గ్లోరియాలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో 8,400 మంది విద్యను అభ్యసిస్తుండగా, 7 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన నిరుపేద పిల్లలు మరియు వారి కుటుంబాల కోసం ఒక స్పోర్టింగ్ వేదిక అందుబాటులో ఉంది.

అప్‌డేట్ల కోసం మమ్మల్ని www.redbull.in, Facebook - http://www.facebook.com/redbull మరియు ట్విటర్ - https://twitter.com/redbullindia లో అనుసరించండి.
ఇమేజెస్ మరియు వీడియోల డౌన్‌లోడ్ కోసం చూడండి: www.redbullcontentpool.com         
మరింత మీడియా సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి:
మ్యాడిసన్ PR
ప్రియాంకా గోకానీ
సెల్: +91 9769350281
ఇమెయిల్: priyanka.gokani@madisonpr.in 
రెడ్ బుల్ ఇండియా
పౌరుషాస్ప్ మెహ్తా
సెల్:  09820664262
ఇమెయిల్:  pourushasp.mehta@redbull.com

More Press News